
ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందించినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ, ఎలాంటి స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. ఈ బిల్లుల పెండింగ్ చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, నిర్వహణ భారం అవుతోందని పేర్కొన్నాయి.
ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు సంబంధించిన వైద్య సేవలనూ నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని, లేని పక్షంలో తమ నిర్ణయం వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే, వేల సంఖ్యలో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే ఈ సమస్య వేగంగా పరిష్కారం అయితే బాగుంటుందని ప్రజల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు