2024 జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా జతకట్టిన టిడిపి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ కూడా ఒకవైపు పార్టీలో జరిగే అన్ని విషయాలను గమనిస్తూ, మరొకవైపు ప్రజల సమస్యలను కూడా గమనిస్తూ, సహాయమని అడిగిన వారికి సహాయం చేస్తూ ఉన్నారు నారా లోకేష్. ఇప్పుడు అలాంటి మంత్రి నారా లోకేష్ కి ఒక అరుదైన గౌరవం దక్కినట్లుగా తెలుస్తోంది.



అదేమిటంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో నారా లోకేష్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు నారా లోకేష్ కు ఒక లేఖను కూడా పంపించారు. విద్య, ఆర్థిక అభివృద్ధి సాంకేతిక వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ ఈ ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తోంది SVP.  గడిచిన 20 సంవత్సరాలలో ఎంతో మంది భారతీయ రాజకీయ నాయకులు ఈ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. 2001లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా SVP లో భాగస్వాములయ్యారంటూ ప్రకటించారు.


ఈ పర్యటనలో మంత్రి నారా లోకేష్ ఎంతోమంది విద్యా నిపుణులను ,రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను కూడా కలిసే అవకాశం ఉంటుంది. వీటివల్ల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, నైపుణ్యాలు, విద్య, అభివృద్ధి వంటి మౌలిక వసతుల పైన కూడా చర్చించేందుకు ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుందట. మొత్తానికి నారా లోకేష్ కి ఆహ్వానం రావడంతో పలువురు కార్యకర్తలు, నేతలు కూడా నారా లోకేష్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాగే మీరు ఎన్నో పనులు చేస్తూ పేరు సంపాదించాలని అలాగే టిడిపి పార్టీని కూడా భవిష్యత్తులో ముందుండి నడిపించేలా చూడాలంటూ తెలియజేస్తున్నారు. మరి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఎలాంటి మార్పులు ఏపీలో తీసుకువస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: