
అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గ్రామం నుంచి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి న్యాయకత్వం దిశగానే అడుగులు వేస్తామంటూ తెలిపారు. నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తానని తెలిపారు. కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమమే ప్రాధాన్యతగా పార్టీ బాధ్యతలు తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ కోసం ప్రతి రోజు కూడా నాలుగు గంటల సమయాన్ని కేటాయిస్తానని 2029 నుంచి 2030కి బలమైన ఒక కొత్త న్యాయకత్వం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటానని , మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ తెలిపారు.
పార్టీలో అన్ని విభాగాలపైన దసరా తర్వాత ప్రత్యేకించి దృష్టి పెడతానని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది జనసేన పార్టీనే ,అలాగే రైల్వే జోన్ తీసుకువచ్చింది కూడా జనసేన పార్టీ, పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామంటూ తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి జబ్బలు చలుచుకోలేదు.. ప్రతి ఒక్కరూ బాగుండాలని ఉద్దేశంతోనే పల్లె పండుగ ,గ్రామసభలు, సిసి రోడ్లు, నీటి కుంటలు ఇలా అన్నిటిని పూర్తి చేసామని తెలిపారు. దసరా పండుగకు ఆయుధ పూజ చేయండి దేశాన్ని బలోపేతం చేద్దాము కూటమి చాలా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని 15 ఏళ్ల పాటు మన ప్రభుత్వమే కొనసాగాలంటూ తెలిపారు పవన్ కళ్యాణ్ . చిన్నపాటి తప్పులుంటే కూర్చొని పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటానని తెలిపారు. మనం చేసే ఈ చిన్నపాటి తప్పులే ప్రజలు నష్టపోయేలా చేస్తాయని.. మళ్లీ చీకటి రోజులు, అరాచ శక్తులు బయటికి వస్తాయంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు