ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడువకముందే టిడిపి జనసేన సైనికులకు మధ్య విపరీతమైనటువంటి గొడవలు అవుతున్నాయి.. టిడిపి నాయకులు మాకు వ్యాల్యూ ఇవ్వడం లేదని జనసైనికులు ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్  ని నిలదీస్తున్నారు. పదవుల పంపకాల్లో కూడా  జనసేనకులకు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో విసుగు చెందిన జనసైనికులు ఒక్కో దగ్గర టిడిపి వాళ్లతో గొడవపు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడే పదవులు అడగకండి ఇంకా 15 సంవత్సరాలు మనం కూటమి గానే ఉంటాం.. ఆ తర్వాత రోజుల్లో మీకు పదవులు తప్పకుండా అందిస్తాను అంటూ సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు..

 కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు తప్ప టిడిపి నాయకులు అయినటువంటి చంద్రబాబు,లోకేష్ లు మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు.పవన్ కళ్యాణ్ అక్కడక్కడా ఇంకా 15 ఏళ్లు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని అనగానే చంద్రబాబు లోలోపల నవ్వుకుంటున్నారని చెప్పవచ్చు.. ఇది సక్సెస్ కావాలంటే మరో 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలి. ఇలా ఉండడం వల్లే  జగన్ కు ఉన్నటువంటి కార్యకర్తలు పూర్తిగా మారిపోయి జనసేన వైపు మళ్లుతారు.. దీనివల్ల జనసేనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పెరుగుతుంది. ఈ బలం పెంచుకోవడానికి ఇంకా రెండు టర్మ్ లు పడుతుందని,అందుకోసమే ఇంకో పది సంవత్సరాలు అయినా సరే కూటమిగా ఉండి జనసేన ను పూర్తిస్థాయిలో నిలబెట్టాలని చూస్తున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడే గొడవ పడకండి పదవి కోసం ఆశపడకండి ఇంకో 15 ఏళ్లు మనం అధికారంలో ఉంటామని చెబుతున్నారు. కానీ పదవులపై కాంక్ష ఉన్నవారు, అధికారం ఉన్నప్పుడే పదవులు అందుకోవాలని కొంతమంది నేతలు తప్పకుండా పదవులు ఇవ్వాలని టిడిపి నేతలతో గొడవలకు దిగుతున్నారు. అదే కాకుండా కొవ్వూరు దగ్గర రామారావు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్కడ టికెట్ వేరే వ్యక్తికి వెళ్లడంతో , ఈయన కాస్త జనసేన పార్టీలో చేరారు. ఆ మధ్య ఆ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో మమ్మల్ని లెక్క చేయడం లేదని  కులాల ప్రాతిపదికన లెక్కలు చెప్పడంతో ఆయనను పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్.

ఇప్పుడు అదే నియోజకవర్గంలో మరోసారి విపరీతమైనటువంటి గొడవ జరిగింది. ఈ విధంగా జనసేన వాళ్లు తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని కొట్టారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జనసైనికులకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో  కాస్త ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. రాబోవు రోజుల్లో అధికారంలోకి ఎవరు వస్తారనేది దేవుడెరుగు కానీ అధికారంలో ఉన్నప్పుడే నామినేటెడ్ పదవులు తీసుకోవాలని జనసైనికులు ఆశించడంలో తప్పులేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: