
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. దసరా పండగ రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలలో వాహన మిత్ర పథకంలో భాగంగా 15,000 రూపాయలు జమ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నామని మా ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం అని చంద్రబాబు తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు కూటమికి 95 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశామని చంద్రబాబు కామెంట్లు చేశారు. తెలుగు తమ్ముళ్ల స్పీడ్, జనసేన జోరు, బీజేపీ ఉత్సాహానికి ఎదురుందా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పాలనను సాగిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.
తల్లికి వందనం అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ది పొందారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడాలని అన్నదాత సుఖీభవ తెచ్చామని 47 లక్షల మంది రైతుల ఖాతాలో నగదు జమ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. దీపం2 స్కీమ్ కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాము కాబట్టే దీపం2 స్కీమ్ సక్సెస్ అయిందని మెగా డీఎస్సి ద్వారా 16,347 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని చంద్రబాబు కామెంట్లు చేశారు. అనంతపురంలో జరిగిన ఈ సభకు ఊహించని స్థాయిలో అభిమానులు వచ్చారు. ఈ సభ సక్సెస్ కావడం కూటమికి ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు