
2024 గోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీ ఇప్పుడు అమరావతి విషయంపై స్టాండ్ మార్చినట్టుగా కనిపిస్తోంది. మూడు రాజధానులు ప్రజల నుంచి వ్యతిరేకం రావడంతో ఇప్పుడు ఆలోచన లేదని.. ఒకవేళ వైసీపీ పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి జగన్ పరిపాలన కొనసాగిస్తారు అంటూ ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం పై భారం తగ్గిస్తూ గుంటూరు, విజయవాడ మధ్య ఒక మహానగ నిర్మాణానికి కూడా తాము కృషి చేస్తామంటూ తెలిపారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి కట్టడాన్ని తాము వ్యతిరేకించామని తెలిపారు. ఆ మధ్య జగన్ కూడా మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ఖర్చు ఎక్కువ అవుతుందంటూ విమర్శించారు. అంతేకాకుండా విజయవాడ, గుంటూరును జంట నగరాలుగా చేయవచ్చని తెలిపారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాజధాని విషయంపై అమరావతి వైపే మెగ్గుచూపునట్లుగా కనిపిస్తోంది వైసిపి.