
అయితే, ఈసారి తొలిసారి సాయి పల్లవి కెరీర్‌లో నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఒక పెద్ద కోలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవిని "హోల్డ్"లో పెట్టారట. అంటే, ఆమెను హీరోయిన్‌గా ఫిక్స్ చేయక, తాత్కాలికంగా ఆ పాత్ర కోసం వేచి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. “సాయి పల్లవి లాంటి నటి ఓకే చేసిన ప్రాజెక్ట్‌ను ఎందుకు హోల్డ్‌లో పెడుతున్నారు?” అని ప్రశ్నలు వేస్తున్నారు.
మూవీ మేకర్స్ నుంచి లీక్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు హీరో సాయి పల్లవినే హీరోయిన్‌గా సూచించాడట. ప్రొడ్యూసర్లు కూడా ఆమెను ఫైనల్ చేయాలని డైరెక్టర్‌కు సలహా ఇచ్చారని తెలుస్తోంది. కానీ, ఆ డైరెక్టర్ మాత్రం సాయి పల్లవి విషయంలో కొంత సందేహంతో ఉన్నాడట. “ఆమె నటన శైలి, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమే కానీ కొన్ని సన్నివేశాలను తెరకెక్కించడం, కావాల్సిన ఎమోషన్లను మలిచే విధానం ఈ ప్రాజెక్ట్‌కు సరిపోతుందా?” అనే ఆలోచనలో ఆయన ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే సాయి పల్లవిని తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారని అంటున్నారు.
సాయి పల్లవి ఎప్పుడూ స్క్రిప్ట్‌పై పూర్తి నమ్మకం ఉన్న ప్రాజెక్ట్‌లలో మాత్రమే నటించేది. ఆమె చేసిన సినిమాలు ఎక్కువగా కంటెంట్ ఆధారితంగా ఉండడం వల్లే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి నటి విషయంలో ఇలాంటి నిర్ణయం రావడం అభిమానులను మరింత ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది నెటిజన్లు డైరెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, మరికొందరు ఇది ప్రాజెక్ట్ క్వాలిటీ కోసం తీసుకున్న జాగ్రత్త అని అంటున్నారు. ఏదేమైనా, ఈ సంఘటన సాయి పల్లవి కెరీర్‌లో కొత్త మలుపు తిప్పే అవకాశముంది. ఇప్పటి వరకు నెగిటివిటీని ఎదుర్కోని ఆమెకు ఇది ఒక పెద్ద పరీక్షగా మారింది. కోలీవుడ్‌లో ఆమె స్థానం, ప్రతిభపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. అయితే, ఆమెకు ఉన్న ఫ్యాన్‌బేస్, టాలెంట్ ఈ సిచ్యువేషన్‌ను కూడా సులభంగా అధిగమించేలా చేస్తాయని అభిమానులు నమ్ముతున్నారు..!!