కూటమిలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరంగా యాక్టివ్గానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల పైన పోరాటం చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన వద్దకు వచ్చిన ఏ సమస్యలనైన కూడా పరిష్కరించేందుకు మక్కువ చూపుతున్నారు పవన్ కళ్యాణ్. గిరిజన సమస్యలు, పల్లె పండుగ అనే కార్యక్రమాలను కూడా రూపొందించి వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. తాజాగా కోనసీమ రైతుల సమస్యల పైన స్పందించి అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు.

ఇలా తన పనితీరుతో సామాన్యాలను ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తాజాగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు వల్ల కొబ్బరి తోటలు దెబ్బతింటున్నాయని ఉమ్మడి గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలోని రైతులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.. ఇందుకు సంబంధించి 13 గ్రామాల రైతులు నష్టపోతున్నారు .ఈ విషయంపై పవన్ కళ్యాణ్ దసరా తర్వాత రైతులను పరామర్శించడానికి వస్తానంటూ భరోసా ఇచ్చారు.


అలాగే ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలను కూడా తీసుకువెళ్లి రైతుల సమస్యకు చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు దీంతో రైతులు కూడా తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు. అలాగే వీటికి తోడు దసరా తర్వాత మరికొన్ని కార్యక్రమాలను జనసేన పార్టీ నేతలు తీసుకువెళ్లాల ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. దసరా నుంచి జనంలోనే ఉంటానని, కచ్చితంగా పార్టీ కార్యాలయంలో రెండు రోజులు కేటాయిస్తానని, ఏపీ అంతట జనసేన పార్టీ ఎక్కడ యాక్టివ్ గా ఉంటుందో ఆ నియోజకవర్గాలలో జనసేన పార్టీ కొన్ని కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాల విషయంలో, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల విషయాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. జనసేన పార్టీ దసరా తర్వాత చాలా ప్లాన్ గానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ 75 నియోజకవర్గాల టార్గెట్ తోనే ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ టార్గెట్ 75 నియోజకవర్గాలు ఉండేలా ప్లాన్ చేసుకొని మరి ముందుకు వెళ్తున్నారట.  జనసేన కార్యకర్తలు ,నేతలకు ఇది ఊపునిచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: