
H1 -B వీసా అన్నటువంటిది.. మొదట ఇది అందరికీ వర్తిస్తుందని తెలియజేశారు.. ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి వారికి ఏమి ఉండదు.. రెన్యువల్ ఫీజు కూడా కట్టుకోవాల్సిన పనిలేదు, కొత్తగా వచ్చే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందంటూ ట్రంప్ తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని వాటికి కూడా ఈ నిబంధనలను తొలగించారు. వాటిలో ఫిజీషియన్లు, వైద్య ఆరోగ్య పరిశోధనలు, రక్షణ జాతీయ భద్రత, స్టెమా కార్యక్రమాలు, ఇంధనం , విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాలలో ఈ లక్ష ఫీజు డాలర్ల గొడవ ఉండదట. వాటికి సంబంధించి మినహాయింపు ఇచ్చారు.
వాస్తవానికి అమెరికా వాళ్లకి ఎక్స్పర్ట్ కలిగిన వారు కావాలి.. కానీ చదువుకోవాలని అక్కడికి వెళ్లి.. చదువుని పూర్తి చేయలేక.. అక్కడ చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే అలాంటి పనులు చేసుకోవడానికి అమెరికాలో కూడా చాలామంది మనుషులు ఉన్నారు.. ఫిజికల్ వర్క్ చేయడానికి అమెరికాలో కూడా చాలామంది ఉన్నారు. మెంటల్ గా స్ట్రెస్ అయ్యేటువంటి సబ్జెక్టుతో కూడినటువంటి పనులలో మాత్రమే మనమల్ని అమెరికా ఆశిస్తోంది. అయితే అక్కడికి వెళ్లి వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తూ ఉండడంతో అమెరికా జాగ్రత్తపడి ఇలాంటి వారందరినీ కూడా పంపించేయాలనే ఉద్దేశంతోనే ఈ లక్ష డాలర్లు నియమం విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.