ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, అక్కడ ఇతర దేశస్థులను, ఉద్యోగులను, చాలా దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. H -1B వీసా, సుంకాలు పెంచడం ఇతరత్న కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలతో పాటు ఇతర దేశస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే అమెరికాని ఇక వదిలేయడమే బెటర్ అన్నట్టుగా చాలామంది నిపుణులు తెలియజేస్తున్నారు. గ్రీన్ కార్డ్, H-1B లేనటువంటివారు అమెరికాను వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా అక్కడ చదువుకుంటున్నటువంటి వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.


అయితే ఇప్పుడు H -1B ఉన్నవాళ్లకు కూడా వేధింపులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా  రిఫార్మింగ్ దా H -1B నాన్ ఇమ్మి గ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ అనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ ను పెట్టారు. దీని ప్రకారం ఫెడరలిజిస్ట్ నమోదు చేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదన వీసాలకు సంబంధించి పరిమితి మినహాయింపు, అర్హతను మరింత కఠినతరం చేయబోతున్నారు. వీసా ప్రోగ్రాం నిబంధనలో ఉల్లంఘించిన యాజమాన్యాల మీద, థర్డ్ పార్టీ నియామకాల మీద కూడా మరింత దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది అమెరికా.


ఈ మార్పులు H -1B వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపరచడానికి, అమెరికా కార్మికుల వేతనాలు, పని ప్రదేశాలలో రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు అంటూ అమెరికా తెలియజేస్తోంది. మొత్తం మీద చూసుకుంటే యూనివర్సిటీలలో 15 % మించి బయట వాళ్లని రానివ్వకుండా చేయడానికి ,అందులో కూడా భారతీయులు 5 శాతం మించి ఉండకూడదంటూ తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ కేవలం స్టూడెంట్ అంటే స్టూడెంట్ గా మాత్రమే ఉండాలని , వీటితో పాటు H -1B లక్ష డాలర్లు ఫీజు వంటివి కేటాయించడం ఇలా ఎన్నో కఠినమైన నిర్ణయాల వల్ల  అమెరికాకు  వెళ్లాలంటే భయపడేలా చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.దీంతో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: