జగన్మోహన్ రెడ్డి  పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. మొత్తం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. మరి జగన్ ఇంతగా విఫలం కావడానికి కారకులు ఎవరు.. అసలు జగన్ వెంట జనమే లేకుండా అయిపోయారా.. మరి జగన్ సభలు పెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయి  ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం టిడిపి, జనసేన, బిజెపి జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురి ఓట్లు కలిపితే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ జగన్ మాత్రం ఒక్కడే సింగిల్ గా కొట్లాడి వారందరినీ వణికించారు. ఒకవేళ జనసేన సపరేట్ గా పోటీ చేసి ఉంటే మాత్రం మళ్లీ జగనే అధికారంలోకి వచ్చి ఉండేవారు. నిజం చెప్పాలంటే జగన్ కి జనాల్లో ఎక్కువగా అభిమానం ఉంది. 

అలాంటి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే ఆయనకు జననిరాజనం పలుకుతున్నారు. అయితే దీనికి కారణం టిడిపి కూటమిలో ప్రభుత్వ పాలన జనాలకు నచ్చడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.. తాజాగా జగన్ నర్సీపట్నం టూర్ లో భాగంగా 60 కిలోమీటర్లు యాత్ర నిర్వహించాడు. ఐదు, పది కిలోమీటర్ల దూరంలో ఉండగానే హెలికాప్టర్లో వెళ్లిపోవచ్చు కానీ ఆయన అలా చేయకుండా  60 కిలోమీటర్ల దూరం స్లోగా వెళుతూ జనాలకు దగ్గరవుతూ కలుస్తూ నవ్వుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్లారు. 11 గంటలకు స్టార్ట్ అయిన యాత్ర నర్సీపట్నం చేరేసరికి సాయంత్రం 5 అయింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. జగన్ 60 కిలోమీటర్లు ఆ విధంగా చేస్తారని టిడిపి ప్రభుత్వం కూడా ఆలోచించలేదు.

అంతమంది జనాలు వస్తారా అంత ఖాళీగా ఉంటుంది కావచ్చు దాన్ని మనం సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిడిపి ఆశపడింది. కానీ దానికి వ్యతిరేకంగా జగన్ యాత్రలో అడుగడుగునా నీరాజనం పలికారు. దీంతో ప్రభుత్వం వణికిపోయినట్టుంది. వెంటనే ఇంటిలిజెన్స్ బ్యూరో ద్వారా అసలు అంత మంది జనం ఎక్కడి నుంచి వచ్చారు..ఎలా వచ్చారు అనేది ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు.. నిజానికి జగన్ పాలన ఉన్నప్పుడు ప్రతిదీ లైవ్ గానే జరిగిందని ప్రజల అభిప్రాయం. ఏ పథకమైన డైరెక్టుగా ఇంటికి వచ్చేది. జగన్ హయాంలో యువత చాలా డెవలప్ అయ్యారు. ప్రశ్నించడం నేర్చుకున్నారు. జగన్ పాలనే బాగుందనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికి కూడా ఉంది. అందుకే జగన్ యాత్ర సమయంలో భారీ వర్షం లో కూడా 60 కిలోమీటర్లు అడుగడుగునా జనాలు ఆయనకు స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: