తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ గురించి ప్రస్తుతం మెయిన్ మీడియాలో,సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది అని ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులపై మంచు విష్ణు స్పందించి మా యూనివర్సిటీ పై దుష్ప్రచారం చేస్తున్నారని, మేం పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని, అలాంటి మాపై ఇలాంటి దుష్ప్రచారాలు తగవు అని నిజమెంటో తెలుసుకోకుండా ఇలా ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం ఏంటని మీడియా ముఖంగా విష్ణు మాట్లాడారు. అయితే ఇప్పటికే 26 కోట్ల అదనపు ఫీజులు వసూలు చేశాయని ఉన్నత విద్య కమిషన్ కి సమాచారం వెళ్ళింది.ఇలాంటి నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీ ఎంత కప్పిపుచ్చుకోవాలని చూసినా కూడా ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉంది.

 తాజాగా విద్యార్థులకు సంబంధించిన కొన్ని సంచలన ఆడియో కాల్స్ బయటపడ్డాయి. ఓ ఆడియో కాల్ లో ఒక తండ్రి కాలేజ్ మేనేజ్మెంట్ తో రెండు రోజులకే 2000 ఫైన్ ఎలా వేసారని ప్రశ్నించగా.. మిగతా కాలేజీ యాజమాన్యాలు తీసుకుంటున్నాయి. అందుకే మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నాం. ఇష్టమైతే కట్టండి లేకపోతే సప్లమెంటరీ రాసుకోండి అంటూ తెగేసి చెప్పారు. ఇక మరో విద్యార్థి 1500 ఫీజు కట్టడం నాలుగు రోజులు లేట్ అయితే రోజుకు 1000 చొప్పున 4000 కట్టాలని డిమాండ్ చేసిన ఆడియో కాల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అధిక ఫీజుల పేరుతో మోహన్ బాబు యూనివర్సిటీ పై ఆరోపణలు రావడమే కాకుండా తాజాగా ఆడియో కాల్స్ కూడా బయటపడడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అంతేకాదు ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజుల పేరుతో 15 లక్షల ఫైన్ కూడా కట్టింది.ఇలాంటి సమయంలో ఈ విషయాలన్నీ బయటికి రావడం నిజంగా MBU యూనివర్సిటీలో జరుగుతున్న మోసాలకు నిదర్శనమే అని చెప్పుకోవచ్చు.అంతేకాదు ఒక్కో ఏడాది బీటెక్,బికాం,ఎంకామ్, బీ ఫార్మసీ, డి ఫార్మసీ వంటి కోర్సులు చేసే విద్యార్థుల దగ్గర నుండి 15,000 నుండి మొదలు 25000,45000 వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారట.ఈ లెక్కన ఒక ఏడాదికే ఈ అదనపు  ఫీజులు ఏకంగా 2.56 కోట్లు వస్తున్నాయి. అలా అదనపు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిసిపోయింది.కానీ ఈ వార్తలపై మంచు విష్ణు మాత్రం మేం పేద పిల్లలకు చదువు చెబుతాం కానీ ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఆశించమని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: