
వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ స్పీడ్ చూసి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నప్పటికీ ఆ అంచనాలను అందుకోలేకపోతోంది. సరైన హిట్లు లేక సతమతమవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ తాను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని తెలియజేసింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంతమంది డైరెక్టర్లు తనని హేళన చేశారంటూ తెలియజేసింది. తన కాళ్లు కాస్త పొడవుగా ఉండడంవల్ల ఒంటె కాళ్లు లాగా ఉన్నాయి అంటూ చాలామంది డైరెక్టర్లు కామెంట్స్ చేశారని ఈ విషయం విన్నప్పుడు చాలా బాధ అనిపించిందని తెలిపింది.
ఒకానొక సమయంలో తన మీద వస్తున్న ఈ ట్రోల్స్, కామెంట్స్ కి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నానని తెలియజేసింది. కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం అలాంటివి పట్టించుకుంటే లైఫ్లో ముందుకు వెళ్లలేమని తనని ఓదార్చి మరి సపోర్టు ఇవ్వడం, ఆ బాధను దిగమింగుకొని మరి సినిమా అవకాశాలను పట్టుకొని హీరోయిన్గా ఎదిగానని తెలిపింది. ప్రస్తుతం కృతి సనన్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో రెండు చిత్రాలను నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రం ప్రస్తుతం ఏ ఒక్క సినిమాలో నటించలేదు.