ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొంథా తుపాను నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాను కారణంగా పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే దిశగా ఆయన అడుగులు వేశారు. పునరావాస కేంద్రాలలో ఉన్న ఒక్కో కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 3,000 అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ఈ కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటు అవసరమైన నిత్యావసరాలను కూడా పంపిణీ చేయాలని సూచించారు.

పునరావాస కేంద్రాలలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు అధికారులను కోరారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే తుపాన్లను ఎదుర్కోవడానికి ఈ కార్యాచరణ ఒక రోల్ మోడల్‌గా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఇంచార్జ్‌లను నియమించాలని కూడా సూచించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా, నీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం తుపాను బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించనుంది. ప్రభావిత జిల్లాల్లో  విద్యా  సంస్థలకు సెలవు ప్రకటించాలని   ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.  జిల్లాల్లో తుపాను రక్షణ చర్యలను  చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ఆయన తెలిపారు.

 వాలంటీర్లుగా వచ్చే వ్యక్తుల యొక్క సహాయక  కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆయన కామెంట్లు చేశారు.  ప్రభుత్వ యంత్రాంగం నిబద్దతతో పని చేసి  తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవాలని  చంద్రబాబు వెల్లడించారు.   ఆలసత్వం  కనిపించకూడదని ఆయన చెప్పుకొచ్చారు.  చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  చంద్రబాబు  విజన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: