 
                                
                                
                                
                            
                        
                        మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సంభవించిన 'మొంథా' తుఫాన్ భీభత్సం సృష్టించిందని, ఈ తుఫాన్ కారణంగా 25 జిల్లాలలో 15 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల (ఆర్.బి.కె.) వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకూ ఈ-క్రాపింగ్ చేసేవాళ్లమని, ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా కల్పించామని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో 85 లక్షల మంది రైతులు బీమా పరిధిలో ఉండేవారని, 70 లక్షల ఎకరాలు పంట బీమా కవరేజ్‌లో ఉండేవని జగన్ తెలిపారు.
అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని జగన్ మండిపడ్డారు.
పొగాకు, మామిడి, ఉల్లి వంటి ముఖ్య పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందని ఆయన విమర్శించారు. తుఫాన్ నష్టాన్ని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ... ఇవన్నీ మానవ తప్పిదాలని పేర్కొన్న జగన్, మరీ ముఖ్యంగా ఈ విపత్తు చంద్రబాబు నాయుడు సృష్టించినదే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి