వరదల్లో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు కూడా సీఎం తెలిపారు. పశు నష్టం విషయానికొస్తే, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే ఒక్కొక్కదానికి రూ. 50,000 మరియు మేకలు, గొర్రెలు చనిపోతే ఒక్కొక్కదానికి రూ. 5,000 చొప్పున పరిహారం ఇస్తారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమని, కేంద్రం రాష్ట్ర వరద నష్టాన్ని వదిలేస్తే కుదరదని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనలపై వరద బాధితులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. రేవంత్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి