బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే మాత్రం 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావచ్చని ఆయన కామెంట్లు చేశారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు.

ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవొచ్చనే ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇస్తూ  ఇక్కడ నేను రెండు అవకాశాలు ఉండొచ్చని అనుకుంటున్నానని తెలిపారు.  ప్రజలు జన్  సురాజ్  ని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఆయన తెలిపారు.  అయితే దీర్ఘకాలంగా నిరాశావాదాన్ని  చూసిన  ఓటర్లు  ముందడుగు వేయడానికి విశ్వాసం అవసరం అని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీ గురించి కూడా ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు.  నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని ఆయన తెలిపారు.  ఒకవేళ నేను పోటీ చేస్తే మాత్రం  కర్గహర్  నుంచి బరిలో ఉంటానని పేర్కొన్నారు. నేనేమీ  ఎక్స్ ఫ్యాక్టర్ కాదని  ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఎన్నికల్లో విజయం గురించి ఆలోచించే సమయంలో జన్  సురాజ్ గెలిచిన సీట్లను చూస్తారా?  లేక నేను పోటీ చేశానా అని చూస్తారా అని ఆయన ప్రశ్నించారు.

బీహార్ లో మహాగట్ బంధన్ కు ప్రత్యామ్నాయం  లేదనే అభిప్రాయం ఉందని  ఆ అభిప్రాయం వేరని వాస్తవం వేరని ఆయన తెలిపారు.  బీహార్ లో మూడింట ఒక వంతు మంది ఈ రెండు కూటములకు ఓటు వేయాలని అనుకోవడం లేదని  ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.  160 నుంచి 170 సీట్లలో జన్  సురాజ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: