ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా ? అన్న సామెత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి చక్కగా వర్తిస్తుంది. ఆ పార్టీ అధినేత జగన్ కీలక సమయంలో మళ్ళీ బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో తాము మాత్రం చేసేది ఏముంటుంది అంటూ తాడేపల్లిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ నలుగురు నేతలు కూడా టూర్లకు వెళ్లిపోయారు. ఢిల్లీకి కొందరు .. మరికొందరు కలకత్తాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తాడేపల్లి కార్యాలయంలో కేవలం సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు నుంచి విమర్శలు వస్తున్నాయి. అందరూ పార్టీ కార్యాలయాన్ని అనాధ లా గాలికి వదిలేసి వెళ్ళిపోతే ఎలా ? అని వైసిపి లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం పార్టీ పరంగా తుఫాను బాధిత గ్రామాలలో పర్యటించాలని అనుకున్నారు. జగన్ కూడా ఓకే చెప్పారు. పార్టీ తరఫున సాయం చేయాలని అనుకున్నారు. ఇంతలోనే జగన్ మనసు మార్చుకుని .. మీరు చూసుకోండి అని బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబు లండన్ టూర్ కి వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఇక్కడ పోరాటం చేసి ఉపయోగం ఉండదని జగన్ కొందరు కీలక నేతలకు చెప్పి బెంగళూరు వెళ్లిపోయారని అంటున్నారు.


జిల్లా స్థాయి నాయకులు ఎంపిక పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా జగన్ పక్కన పెట్టేసారని తెలుస్తోంది. తాడేపల్లి కార్యాలయంలో అన్ని వ్యవహరించే కీలక నేతలు కూడా పర్యటనలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా పార్టీపై గట్టి ఎఫెక్ట్ పడుతుందని.. వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. జగన్ ఇలాంటి టైం లో రాష్ట్రంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాల్సింది పోయి.. బెంగళూరు వెళ్ళిపోతే ఇక పార్టీని ఎవరు పట్టించుకుంటారు ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: