విజయనగరం జిల్లా టిడిపికి కొత్త అధ్యక్షుడు ఎవరు ? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ప్రస్తుతం కిమిడి నాగార్జున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చీపురుపల్లి టిడిపి సీటు విషయంలో నాగార్జునకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆయనకు జిల్లా పార్టీ పదవి ఇచ్చి అసంతృప్తి చెల్లార్చారు అయితే ఇప్పుడు టిడిపి అధ్యక్ష పదవికి అధిష్టానం మళ్ళీ నాగార్జున వైఫై మగ్గుచూపుతోందా ? అంటే కాస్త సస్పెన్స్ నెలకొంది. కొద్దిరోజులుగా జిల్లా అధ్యక్ష పదవి మార్పుపై వాహనలు ఊపందుకున్నాయి. ఎవరికి వారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు .. సీనియర్ నేతలు కంది చంద్రశేఖర్ - సువ్వాడ రవిశంకర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం జిల్లా అధ్యక్ష పదవి మరోసారి చేపట్టేందుకు అంత ఆసక్తిగా లేదని మరో ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికి డిసిసిబి చైర్మన్గా ఉన్న నాగార్జునకు రెండు పదవులు అవసరమా అన్న ? విమర్శలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రతిపక్ష వైసిపికి ధీటుగా బదులిచ్చే నాయకుడిగా నాగార్జున మాత్రమే కనిపిస్తున్నారు. బొత్స అతని మేనల్లుడు చిన్న శ్రీను ను కౌంటర్ ఎటాక్ చేయడంలో నాగార్జున సక్సెస్ అయ్యారు అనే టాపిక్ కూడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సంసాగత ఎన్నికలపై దృష్టి పెట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాకు సంబంధించి పరిశీలకులను పంపి అభిప్రాయం సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే పార్టీ నేతల్లో మరి ముఖ్యంగా జిల్లా పార్టీ పదవిపై ఆశలు పెట్టుకున్న వారిలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి