జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియబోతోంది. దీంతో మూడు పార్టీల మధ్య ప్రచారం విపరీతంగా సాగుతోంది. అంతే కాదు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సపోర్టుగా మంత్రివర్గం ఇతర నాయకులంతా వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు సపోర్టుగా కేటీఆర్,బీఆర్ఎస్ మాజీ నాయకులంతా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ మాగంటి గోపీనాథ్ కి సపోర్ట్ గా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి పెద్దపెద్ద నాయకులంతా ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా లంకల దీపక్ రెడ్డి ప్రచారానికి సంబంధించి జూబ్లీహిల్స్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆ వేదికగా ఆయన చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని,ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాటే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 

కేటీఆర్ చాలా నీచుడని, ఈ విషయం బయటకు రావాలి అంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ చేయించేద్దాము. సీఎం రేవంత్ రెడ్డికి విచారణ చేయించే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు.. కేటీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని  తెలియజేశారు. ఇక కేసీఆర్ ఒక మూర్ఖుడైతే ఆయన కుమారుడు పరమ మూర్ఖుడు అంటూ బండి సంజయ్ తీవ్ర దుమారం రేపే మాటలు మాట్లాడాడు. కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ కు అస్సలు లేదని, ఆయన ఎప్పుడు గద్దెనెక్కి కూర్చుందామా అని తహతహలాడుతున్నారని తెలియజేశారు. కేటీఆర్ కు ముసలి ముతకా అంటూ ఏ ఆలోచనలు ఉండవని, మొత్తానికి తాను సీఎం కావాలనే ఆలోచన ఉందని, దీంతో తన తండ్రిని చెల్లెలు ఎవరిని కూడా పట్టించుకోకుండా మొండిపోకడతో వెళ్తున్నారని తెలియజేశారు..

అసలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందే బిజెపి పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఏనుగులు తినేటోడుపోయి పీనుగలు పీక్కు తినేటోడు వచ్చిండంటూ రేవంత్ రెడ్డి పై దారుణ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో హిందూ బంధువులంతా ఒకటైపోయి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని సూచించారు. దమ్ము లేని కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఇస్లాం రాజ్యాంగ మారుస్తారని ఆరోపించారు.. చివరికి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక బండి సంజయ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. మరి బండి వ్యాఖ్యలపై కేటీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: