భారత్ మహిళా క్రికెటర్ గా పేరు సంపాదించిన నల్లపు రెడ్డి శ్రీ చరణీకి ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇటీవలే భారత మహిళ క్రికెట్ వరల్డ్ కప్ లో కడప అమ్మాయి టీమ్ ఇండియా క్రికెట్ లెఫ్ట్ అండ్ స్పిన్నర్ గా అద్భుతమైన బౌలింగ్ తో రాబట్టింది. ఏపీకి వచ్చిన ఈ మహిళా క్రికెటర్ ని మంత్రులు అనిత, సంధ్యారాణి, కేశినేని చిన్ని తో సహా మరి కొంతమంది మాజీ క్రికెటర్లు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు ఇండియన్ మహిళా క్రికెటర్ ను. ఇటీవల జరిగిన మహిళా వన్డే 2025 గాను గెలిచిన సందర్భంగా శ్రీ చరణీకి అభినందనలు తెలియజేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి మంత్రులు సీఎం చంద్రబాబు దగ్గరికి శ్రీ చరణీని తీసుకువెళ్లారు.


సీఎం చంద్రబాబు  ఉండవల్లి నివాసంలో ఉండడంతో అక్కడ చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా కలిసి శ్రీచరణీని అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా కూడా చాటి చూపించారని మహిళా క్రీడాకారులకు మీరు ఆదర్శంగా నిలవాలంటు సలహా ఇచ్చారు సీఎం చంద్రబాబు. చదువుకొనే బాలికలు సైతం వీరిని స్ఫూర్తిగా తీసుకొని పైకి ఎదగాలని తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి ప్రతిభను కనబరిచిన వారందరికీ కూడా అన్ని విధాలుగా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ తెలియజేశారు.


అలాగే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. తొలిసారి వన్డే ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టులో శ్రీ చరణీ కీలకమైన పాత్ర పోషించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం  శ్రీ చరణీకి ప్రభుత్వ ఉద్యోగంతో(గ్రూప్ - 1)పాటుగా కడపలో  ఇంటి స్థలం  ఏపీ సర్కార్ గిఫ్ట్ కింద అందజేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 2.5 కోట్ల రూపాయలు నగదు కూడా అందజేసినట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: