బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సన్నద్ధమైన సంగతి తెలిసిందే.  మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.  బీహార్ చరిత్రలో జరిగిన అత్యధిక పోలింగ్ లో ఈ ఎన్నికలు కూడా ఒకటి కావడం గమనార్హం. అధికార ఎన్.డీ.ఏ కూటమిదే విజయం అని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్న సంగతి తెలిసిందే.  మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి.

బీహార్ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు కావడం గమనార్హం.  రెండు విడతల్లో ఎన్నికలు జరగగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం కొసమెరుపు.  ఓటర్ల జాబితా  ప్రత్యేక సమగ్ర సవరణ,  ఓట్ల చోరీ ఆరోపణలు,  నిరుద్యోగం, వలసలు,  అవినీతి, అభివృద్ధిలో వెనుకబాటు,  శాంతిభద్రతలు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ప్రధాన రాజకీయ పార్టీలు అలవి కాని  హామీలను ఇచ్చి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు సాగించాయి.  ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఎవరు  ఊహించని హామీలను సైతం ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడం కొసమెరుపు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్.డీ.ఏ కూటమిదే విజయం అని క్లియర్ గా చెబుతున్నాయి.  2020 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎన్.డీ.ఏ కూటమి విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో కూడా అదే  ఫలితం రిపీట్ అవుతుందేమో చూడాలి. ఎన్.డీ.ఏ కూటమి ఐదేళ్ల పాలనకు ఈ ఫలితాలు నిదర్శనం అని చెప్పవచ్చు.  దేశంలో మోదీ  హవా మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగే ఛాన్స్ ఉండగా బీహార్ ఎన్నికల్లో ఎన్.డీ.ఏ కూటమినే విజయం వరిస్తుందేమో  చూడాల్సి ఉంది.  ఈ ఎన్నికల ఫలితాల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: