మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు మొదలైంది. లెక్కింపు కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు కానుంది. ఈ ఉపఎన్నికలో ఏకంగా 58 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి.

స్టేడియంలో రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు.  ఈ లెక్కింపు ప్రక్రియ కోసం  186 మంది సిబ్బందిని నియమించారు.  మొత్తం 407  పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు పది రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారని తెలుస్తోంది.  ఉదయం 8 గంటలకు ఇళ్ల వద్ద వేసిన  103 బ్యాలెట్ ఓట్లతో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది.  10 నుంచి 20 నిమిషాల్లో  ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తారని సమాచారం అందుతోంది.

ప్రతి టేబుల్ దగ్గర ప్రతి అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంట్ ఉండవచ్చని తెలుస్తోంది.  అభ్యంతరాలపై ఏజెంట్లు ఫిర్యాదు చేస్తే  కౌంటింగ్ సూపర్ వైజర్,  రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు.  ఓట్ల లెక్కలో వ్యత్యాసం ఉంటే  వీవీ ప్యాట్  డబ్బాలలోని  చీటీలను గుర్తుల వారీగా లెక్కించడం జరుగుతుంది.  ఎలాంటి ఫిర్యాదు లేకపోతే  కౌంటింగ్ అబ్సర్వర్ ఎన్నికల ఫలితాన్ని  కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది.

అన్ని రౌండ్లు పూర్తైన తర్వాత  విజేతకు ధ్రువపత్రాన్ని అందజేస్తారు.  సాయంత్రం 4 గంటల కల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.  ఫిర్యాదులతో సంబంధం లేకుండా నియోజకవర్గానికి  ఐదు వీవీ ప్యాట్ డబ్బాల్లోని చీటీలను లెక్కిస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం ఇదే నియమాన్ని ఫాలో అవుతామని అధికారులు చెబుతుండటం గమనార్హం.  అధికార పార్టీకే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: