ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ బైక్ పోలింగ్ ఎన్నికలు అక్కడ అన్ని పార్టీలు సైతం చాలా సీరియస్గా తీసుకొని మరి విస్తృతంగా ప్రచారం చేశారు. నవంబర్ 11వ తేదీన జరిగిన ఈ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికలలో కాంగ్రెస్ ,బిఆర్ఎస్ రెండు పార్టీల సైతం రిగ్గింగ్ చేశాయంటు ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచడమే కాకుండా దొంగ ఓట్లు వేసుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.


అయినా కూడా జూబ్లీహిల్స్ బై పోలింగ్ ఎన్నికలలో గెలుస్తామని నమ్మకంతో బిజెపి పార్టీ ఉందంటూ తెలియజేశారు. తాము ఎగ్జిట్ పోల్స్ ని అసలు పట్టించుకోవాల్సిన పనిలేదని జూబ్లీహిల్స్ ప్రజలు బిజెపికి మద్దతుగా ఉన్నారంటూ తెలియజేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సైతం బిఆర్ఎస్ పార్టీ చాలా కష్టపడిందని, కాంగ్రెస్ గెలవకపోతే బిఆర్ఎస్ పార్టీ నేతలను జైలుకు పంపిస్తారని భయం వారిలో కలగడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచేలా బిఆర్ఎస్ పార్టీ కృషి చేసిందంటూ ఎన్ రామచంద్రరావు ఆరోపణలు చేశారు.


కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిందని ఈ మూడు పార్టీలు ఒకటే అంటూ రామచంద్రరావు ఆరోపణలు చేశారు. బీహార్ ఎన్నికలలో కూడా అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు అక్కడ ప్రజలు, ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ తెలియజేశారు. ఈ రోజున ఎట్టకేలకు జూబ్లీహిల్స్ బై పోలింగ్ ఫలితాలు రాబోతున్నాయి అలాగే బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజే వెలువబోతున్నాయి. మరి ఎన్నో రోజులు ఉన్నటువంటి ఉత్కంఠతకు ఈరోజు తెరపడబోతోంది. జూబ్లీహిల్స్ 3 ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో 42 టేబుల్ ల పైన ఈ కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుచేసి ఆ పర్యవేక్షణలోని కౌంటింగ్ పనులను 186 మంది సిబ్బందితో ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: