జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఏకపక్షంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దాదాపు ఖాయమైనట్లుగా స్పష్టమవుతోంది. ఒక్కో రౌండ్ ముగిసే కొద్దీ ఆయన ఆధిక్యం పెరుగుతూ పోతోంది.

ఇప్పటివరకు ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ ఏకంగా 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. ఈ స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విజయం విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అయ్యిందని సోషల్ మీడియాలో విస్తృతంగా కామెంట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్‌లో తిరుగులేని ఆధిక్యం దక్కినట్లు తేలిపోయింది.

మరోవైపు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తమకు విజయావకాశాలు లేవని నిర్ధారించుకుని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సత్తా చాటే విషయంలో బీజేపీ మరోసారి ఫెయిల్ అయిందనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సంబంధం లేకుండా నోటాకు సైతం చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు నమోదు కావడం.

మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయం కావడంతో, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: