జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ప్రచారం జరగగా ఆ ప్రచారమే నిజమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల్లో విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎవరూ సాధించని స్థాయిలో 25 వేలకు పైగా ఓట్లతో నవీన్ యాదవ్ గెలిచారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ప్రతి రౌండ్ లో నవీన్ యాదవ్ సత్తా చాటారు.
నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం కొసమెరుపు. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టడం ఎన్నికల్లో కాంగ్రెస్ ను గేమ్ చేంజర్ గా నిలిపింది. నవీన్ యాదవ్ కు ఈ గెలుపు సులువుగా దక్కలేదు. ఎన్నో ఓటములను మెట్లుగా చేసుకుని నవీన్ యాదవ్ ఎన్నికల్లో విజయం సాధించారు.
2009లో యూసఫ్ గూడలో ఎం.ఐ.ఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ కార్పొరేటర్ గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. 2014లో ఎం.ఐ.ఎం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ డివిజన్ లో నవీన్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2015లో రహ్మత్ నగర్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. 2018లో జూబ్లీహిల్స్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి నవీన్ యాదవ్ 18 వేలకు పైగా ఓట్లు సాధించారు.
2023 సంవత్సరం నవంబర్ 15వ తేదీన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవీన్ యాదవ్ బీ ఆర్క్ చదవగా హైదరాబాద్ లో యూసఫ్ గూడా ఆయన స్వస్థలం. నవయుగ ఫౌండేషన్ ను స్థాపించిన నవీన్ యాదవ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ యాదవ్ తన లక్ష్యాన్ని సాధించారు.
naveen yadav
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి