బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ఒక గొప్ప రాజకీయవేత్త అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. ముఖ్యంగా బీహార్ ప్రాంతంలో ఆయనకు ఉన్నటువంటి పేరు చెక్కుచెదరలేదని తాజాగా బీహార్ ఫలితాలతో మరొకసారి నిరూపించారు. నితీష్ కుమార్ ముందు ప్రభుత్వ వ్యతిరేకత తేలిపోయింది. గతంలో కంటే జెడియూ, ఎన్డీఏ కూటమిలో JDU అధికంగా సీట్లు సంపాదించుకుంది. నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ 201 స్థానాలలో ముందంజలో ఉంది ఎన్డీఏ కూటమి.


బీహార్ ప్రజలకు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా పనిచేసి తన రికార్డును మరింత బలోపేతం చేశారు నితీష్ కుమార్. నితీష్ కుమార్ పాట్నా సమీపంలోని భక్తియార్పూర్ లో 1951లో జన్మించారు. నితీష్ కుమార్ తండ్రి  స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఆయుర్వేద వైద్యుడు. తల్లి గృహిణి. నితీష్ కుమార్ బీటెక్ చదివిన తర్వాత , ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డులో కొంతకాలం పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే రాజకీయాల పైన మక్కువ ఉండడంతో పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చారు. ఆర్జెడి అధినేత లాలు ప్రసాద్, దివంగత బిజెపి నేత సుశీల్ కుమార్ మోదీ వంటి నేతలతో కూడా మంచి స్నేహబంధం ఉంది.

నితీష్ కుమార్ 1977, 1980,1085 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ దిగగా.. 1985లో మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల పరంగా ప్రత్యేకించి దృష్టి పెట్టి 1989, 91,96,98,99,2002 విజయవంతంగా ఎంపీగా ఎన్నికయ్యారు. 15 ఏళ్ల వ్యవధిలోనే ఆరు ప్రత్యక్ష ఎన్నికలలో కూడా ఎదుర్కొన్నారు. ఎన్డీఏ  ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో బెంగాల్లో జరిగిన ఒక రైలు ప్రమాదం తర్వాత రాజీనామా చేశారు.


ఆ తర్వాత 2000 సంవత్సరం మార్చిలో ఒక వారం రోజులపాటు బీహార్ సీఎంగా పనిచేయడం జరిగింది. 2004లో కేంద్రంలో ఎన్డీఏ ఓడిపోయింది. బీహార్ కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతగా నితీష్ కుమార్ పేరు సంపాదించారు. చివరిసారిగా 1985లో అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఎక్కువగా లోక్సభ బరిలోని నిలబడ్డారు. 2005లో ఆర్జెడి పైన వ్యతిరేకతను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లి, నితీష్- వాజ్పేయి జోడి nda ను అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది. దీంతో రెండవ సారి సీఎంగా ఎన్నికయ్యారు. ఇక ప్రజా సంక్షేమ బడ్జెట్ తో బీహార్ లో ఉండే గుండాలను ఉక్కు పాదంతో అణిచివేశారు.

 రాజకీయాలకు తన కుటుంబాన్ని కూడా దూరంగా ఉంచారు. మహా దళితులు, అత్యధికంగా వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఈయన పైన అవినీతి ఆరోపణలు చేయాలంటే ప్రత్యర్థులు కూడా ఆలోచించుకునేలా పాలన చేశారు.మోదీ రాకతో బీహార్ రాజకీయాలలో చాలా కీలకమైన మార్పులు చేసుకున్న. ప్రధాని మోదీతో బీహార్ సీఎం నితీష్ కు మొదట్లో పెద్దగా స్నేహం లేదు.. 2010 ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా నితీష్ మోడీతో కలిసి ఇష్టపడలేదు. 2014 సార్వత్ర ఎన్నికలలో మోడీ నేతృత్వంలో విజయాన్ని అందుకున్నారు.


2015 కాంగ్రెస్, RJD ఎన్నికల బరిలో దిగి గెలవగా ఆ తర్వాత మోడీ స్నేహాన్ని కాదనుకున్న నితీష్ తిరిగి ఎన్డీఏ  కూటమిలోకి చేరారు. 2024 ఎన్నికల ముందు స్వయంగా మోదీ, అమిత్ షా వంటి వారు నితీష్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామంటూ ప్రకటించారు. రాజకీయ నేతగా పేరు సంపాదించిన నితీష్ బీహార్ రాష్ట్రంలో 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. అలాగే మహిళల ఖాతాలో పదివేల రూపాయలు జమ చేశారు. అలాగే ఉపాధి పైన అధికంగా దృష్టి పెట్టారు. ఇలా ఎన్నో పథకాలను కూడా అమలు చేయడంతో ఎన్డీఏ కూటమికి ఇప్పుడు మళ్లీ కలిసొచ్చింది.బీహార్ ముఖ్యమంత్రిగా 19 ఏళ్ల 84 రోజులు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: