కవిత కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. గెలిచి తన రాజకీయ చతురతను చూపించింది. అలాంటి కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలు పాలై బయటకు వచ్చిన తర్వాత తన సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.  తన సొంత ఫ్యామిలీనే నిందిస్తూ శాపనార్ధాలు పెడుతూ వస్తోంది. మరి కవిత వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందా.. ఒక ఇంటి ఆడబిడ్డ ఇలా శాపనార్ధాలు పెడితే మంచిదేనా అనే వివరాలు చూద్దాం.. 2023 తో పోల్చుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బీజేపీకి మాత్రమే ఓట్లు తగ్గాయి. 2023 లో 25865 ఓట్లు వచ్చాయ్. కానీ ఈసారి లంకల దీపక్ రెడ్డికి 17వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 8000 ఓట్లు తగ్గి అవి కాంగ్రెస్ కి పడ్డాయి అని అంటున్నారు.

 అలాంటి ఈ సమయంలో కవిత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ బీఆర్ఎస్ ను పరోక్షంగా విమర్శిస్తూ  ఒక ట్వీట్ చేసింది.. ఆమె స్పందించిన విధానాన్ని చూసి చాలామంది రాజకీయ విశ్లేషకులు తిట్టిపోస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రి ద్వారా రాజకీయం నేర్చుకొని తండ్రి పెట్టిన పార్టీని నాశనం చేయాలని చూస్తున్నావు.. ఘనంగా పెళ్లి చేసి ఆడపిల్లని అత్తారింటికి పంపారు. కనీసం అత్తవారింటి దగ్గర ఎలాంటి ఆస్తులు సంపాదించక పోగా, పుట్టింటి నుంచి ఎంతో ఆస్తిని గౌరవాన్ని పేరును తీసుకొని చివరికి సొంతింటి వారిని నిందిస్తూ శాపనార్ధాలు పెడుతోంది కవిత. '

కేవలం కవిత కాదు  ఏపీలో షర్మిల కూడా ఇదే బాటలో వెళ్ళింది. చివరికి తన అన్న జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఓడించింది. ఇప్పుడు అదే బాటలో కవిత కూడా నడుస్తూ  కేటీఆర్, హరీష్ రావులను తిడుతూ వస్తోంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆమె కర్మ హిట్స్ బ్యాక్ అని ట్విట్ చేయడంతో, చాలామంది ఈమె ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికే పుట్టినట్టు ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా పుట్టినింటికి ఆడబిడ్డలు శాపాలుగా మారుతున్నారని  చాలామంది బీఆర్ఎస్ అభిమానులు కవితను తిట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: