జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎట్టకేలకు పూర్తయిపోయింది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల పోటీ మధ్య కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో నిలిచారు. అలాగే బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి యువ నాయకుడు నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఈ విధంగా త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎనక కాంగ్రెస్ పార్టీకి ఒక జీవన్మరణ పోరాటం. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ అంతా సీఎం రేవంత్ రెడ్డి పై పడేది. రేవంత్ రెడ్డి అభ్యర్థి ఎంపిక నుంచి మొదలు కాంగ్రెస్ గెలవడం కోసం శాయశక్తులా కృషి చేశారు. అడుగడుగునా సమీక్షలు,సమావేశాలు నిర్వహిస్తూ అక్కడి రిజల్ట్ పైన అంచనా వేశారు. 

కాంగ్రెస్ లోని ఇతర నాయకులు నవీన్ యాదవ్ ని వద్దని చెప్పినా కానీ సీఎం రేవంత్ రెడ్డి వినకుండా తన ప్లాన్ ప్రకారం నవీన్ యాదవ్ కి  టికెట్ ఇప్పించారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం నిర్విరామ కృషి చేశారు. చివరికి హైదరాబాదులో మరో నియోజకవర్గంలో పట్టు సాధించారు కాంగ్రెస్ శ్రేణులు.. ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందే నవీన్ యాదవ్ ను అభ్యర్థి గా ప్రకటించిన రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని సైలెంట్ చేశారు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయనను కేబినెట్లోకి తీసుకొని ప్రత్యేక స్థానం కల్పించడంతో చాలా ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు పడ్డాయి. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ లో ఖాతా తెరవనటువంటి కాంగ్రెస్ ఈసారి రేవంత్ రెడ్డి వ్యూహంతో నవీన్ యాదవ్ గెలవడం ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చింది. అభ్యర్థిని ప్రకటించక ముందే ముగ్గురు మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చి నియోజకవర్గమంతా ప్రచారం చేయించారు.

ఆ తర్వాత నవీన్ యాదవ్ ను ప్రకటించి నియోజకవర్గం లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు చివరికి ముఖ్యమంత్రి కూడా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొని  నవీన్ యాదవ్ గెలుపుకు బంగారు బాటలు వేశారు. బీఆర్ఎస్ ఎన్నీ కుట్రలు చేసినా వాటన్నింటినీ తిప్పి కొట్టి అద్భుత మెజారిటీ దిశగా కాంగ్రెస్ ని గెలిపించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే మాత్రం తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి సీట్ కే ఎసరు వచ్చేది. కానీ ఆయన ఒక సీఎం లా కాకుండా ఒక కార్యకర్తలా  నియోజకవర్గం అంతా తిరుగుతూ కాంగ్రెస్ ని గెలిపించడమే కాకుండా బీఆర్ఎస్ పని అయిపోయిందనే మెసేజ్ కూడా ఇచ్చారని చెప్పవచ్చు. అంతేకాకుండా బీహార్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గెలుపు ఒక మంచి పరిణామంగా చూపించారు. అంతే కాదు ఢిల్లీ అధిష్టానం దృష్టిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: