తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో అత్యంత ఆసక్తితో ఎదురుచూసే సర్వేలలో కేకే సర్వే ఒకటి. కచ్చితత్వం, క్లారిటీ, గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండే విశ్లేషణ ఇవ‌న్నీ కేకే సర్వేకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే సర్వే చెప్పిన అంచనాలు హుందాగా నిజం కావడంతో, ఈ సంస్థ మీద ప్రజలు, మీడియా, రాజకీయ నాయకుల్లో విశ్వాసం మరింత పెరిగింది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో శాతాల వారీగా చెప్పడమే కాకుండా, ఆ లెక్కలంతా ఫలితాల్లో ఒక్కోటి సరిపోయాయి. ఆ కచ్చితత్వం వల్ల కిరణ్ కొండేటి పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.


అయితే… జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలతో ఈ క్రెడిబిలిటీకి పెద్ద పరీక్ష వచ్చింది. కేకే సర్వే ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయం అని ధీమాగా చెప్పింది. ప్రీ పోల్స్ మరియు ఎగ్జిట్ పోల్స్ రెండింటిలోనూ బీఆర్ఎస్‌కు భారీ ఆధిక్యం చూపించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్‌కు 49 % ఓట్లు, కాంగ్రెస్‌కు 41 %, బీజేపీకి 8% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అంతేగాక బీఆర్ఎస్ పాలనపై ప్రజలలో మంచి నమ్మకం ఉందని గట్టిగా విశ్లేషించింది. ప్రీ పోల్స్‌కి వస్తే బీఆర్ఎస్‌కు ఏకంగా 55.2% ఓటు షేర్, కాంగ్రెస్‌కు 37.8%, బీజేపీకి 7% అని ప్రకటించటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కానీ వాస్తవ ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. బీఆర్ఎస్ భారీ తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో కేకే సర్వే అంచనాలు పూర్తిగా తప్పు అయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి.


ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ప్రీ పోల్స్ రిలీజ్ చేయడం వల్ల కేకే సర్వే ఎన్నికల నియమాలను ఉల్లంఘించిందని కాంగ్రెస్‌కు చెందిన అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు కూడా చేశారు. ఇది సర్వేపై మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. గతంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేకే సర్వే బీజేపీ ఓడిపోతుందని చెప్పి రివ‌ర్స్ అయ్యింది. కానీ అక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు వరుస తప్పిదాల వల్ల కేకే సర్వే క్రెడిబిలిటీపై ఇప్పుడు ప్రశ్నార్థకాలు తలెత్తుతున్నాయి. 2019, 2024లో దూకుడు చూపించిన ఈ సంస్థ ఇప్పుడు పలు సందర్భాల్లో గ్రౌండ్ రియాల్టీ ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల మ‌వుతూ ఉండ‌డం వారి విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: