జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట కవిత చేసిన ట్వీట్ రాజకీయాలలో సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత ట్విట్ చేస్తూ .. కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో కవిత ఇన్ డైరెక్ట్ గానే బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ట్విట్ చేసిందంటు పలు రకాల కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఈ ట్విట్ పైన బిఆర్ఎస్ శ్రేణులు కూడా తమదైన స్టైల్ లో కౌంటర్స్ ఇస్తున్నారు.


శత్రువులు ఎక్కడో ఉండరు. ఇదిగో ఇలా మన చుట్టూ కూతుళ్లు ,చెల్లెల రూపంలోనే తిరుగుతూ ఉంటారంటూ ఆమెకు కౌంటర్ గా ట్విట్ చేస్తూ కొన్ని ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికలు నిన్నటి రోజున వెలుపడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ అక్కడ భారీ విజయాన్ని అందుకున్నారు. బిఆర్ఎస్ దివంగత  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్య కారణాలవల్ల అక్కడ ఉప ఎన్నిక  జరిగింది.

ఈ ఉప ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు సైతం చాలా సీరియస్ గానే తీసుకున్నాయి. కానీ విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీని వరించింది. ఈ విజయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు ప్రజల మద్దతు లభించిందంటూ కాంగ్రెస్ నేతలు సైతం తెలియజేస్తున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ లో భారీగానే ప్రచారం చేసినప్పటికీ ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. ఇక బిజెపి అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడవ స్థానంలో నిలవడంతో పాటు డిపాజిట్ కూడా కోల్పోయింది. తెలంగాణలో మొత్తం మీద 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతం 66 కి చేరింది. ఈ ఫలితాలతో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన కూడా ప్రభావం చూపించేలా అవకాశం ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: