సీఎం పీఠం తమదే అని ధీమాగా ఉన్న ఆయనకు బీహార్ ఓటర్లు ఊహించని ఝలక్ ఇచ్చారు. సీఎం సీటు సంగతి దేవుడెరుగు... ఆయన పార్టీ ఆర్జేడీ (RJD) బీహార్ అసెంబ్లీలో అతి చిన్న పార్టీగా మారిపోయే పరిస్థితి దాపురించింది! మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో... తేజస్వి నేతృత్వంలోని మహా ఘట్ బంధన్‌కు దక్కింది కేవలం 34 సీట్లు మాత్రమే! ఎన్డీయే (NDA) కూటమి ఏకంగా నూటికి ఎనభై శాతంకు పైగా సీట్లు గెలుచుకుని... అసెంబ్లీని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. గతంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్న తేజస్వికి ఇప్పుడు కేవలం కూటమి నేతగా మాత్రమే విపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉంది.
మైక్ దక్కుతుందా? .. జంబో జెట్ లాంటి అధికార పక్షం (NDA) ముందు... కేవలం 34 సీట్లతో ఉన్న విపక్ష కూటమి గొంతు ఎంతవరకు వినిపిస్తుంది? "విపక్షానికి కనీసం మైక్ అయినా దక్కుతుందా?" అన్న చర్చ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ పార్టీకి ఏకంగా 80 శాతానికి పైగా సీట్లు కట్టబెట్టి... ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీల సీట్లను భారీగా తగ్గించడం చూస్తే... ప్రజలు తమ 'యాంటీ ఇంకెంబెన్సీ'ని అధికార పక్షం మీద కాకుండా, విపక్షం మీద చూపించారు అని తేలిపోయింది! బీహార్ ప్రజల ఈ సంచలన తీర్పు దేశ రాజకీయాలనే నివ్వెరపోయేలా చేసింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి