భారతదేశంలో భారతీయ జనతా పార్టీ హవా చూపిస్తోంది.. దేశవ్యాప్తంగా తన పాలనను అందిస్తూ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. మోడీ అమిత్ షా సారథ్యంలో బీజేపీ దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఏ ఎలక్షన్ అయినా సరే వారికి సాటి లేదని అనిపించుకుంటుంది. గెలిచే దగ్గర సోలోగా పోటీ చేస్తూ కాస్త ఇబ్బంది ఉన్న రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకొని మరీ పోటీ చేసి, మొత్తానికి గెలుపును చవి చూస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ తన హవా కొనసాగిస్తున్నా కానీ, దక్షిణాదిలో మాత్రం కాస్త చతికిల పడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంతగా ఆదరణ లభించడం లేదు. ఎంత కష్టపడి ప్రచారం చేసినా ఇక్కడ బొక్క బోర్లా పడుతూనే ఉంది. అలాంటి బీజేపీ తాజాగా  మరో ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం అద్భుతమైన మెజారిటీతో దూసుకుపోతున్న బీజేపీ  తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసి వారి ఓటు షేరింగ్ ను పెంచుకోవాలని చూస్తోంది. 

ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు  ఇప్పటికే చంద్రబాబుతో జతకట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కొన్ని సీట్లు గెలిచేలా చేశారు. ఇదే సమయంలో ఏపీలో వారి బలం పెంచుకోవడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు సమాచారం..2024 ఎలక్షన్స్ లో వైసీపీకి  11 సీట్లు వచ్చినప్పటికీ 40% ఓట్ షేరింగ్ లభించింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను వారి వైపు తిప్పుకోవడం కోసం కొన్ని ప్లానింగ్ లు చేస్తుందట. దీనివల్ల 2029 ఎలక్షన్స్ వరకు బీజేపీ మరిన్ని సీట్లు కొట్టి ఏపీలో వారి బలాన్ని పెంచుకోవచ్చనే ప్రణాళికతో ముందుకు వెళుతుందట.

ఈ విధంగా బీజేపీ చేసిన ప్లాన్ వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. వీళ్లు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వైసీపీకి కాస్త డ్యామేజ్ అవ్వడం తప్పదని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ప్లాన్ వల్ల కేవలం వైసీపీకి నష్టం అవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. టిడిపిలో 2029 ఎలక్షన్స్ వరకు టికెట్లు అందని కొంతమంది నేతలు, అసంతృప్తులు ఆ పార్టీలో ఉండకుండా వైసీపీలో లేదా బిజెపిలో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఏపీలో బీజేపీ బలపడింది అంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీలకు నష్టమే అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: