- ఎమ్మెల్యే రోషన్, ఎంపీ పుట్టా, గన్ని సహకారంతోనే ఈ పదవి
- కోట మండల టీడీపీ అధ్యక్షులు కిలారు
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
కామవరపుకోట మండలంలో పార్టీ కార్యకర్తల కష్టంతోనే తనకు వరుసగా రెండోసారి మండల టీడీపీ పదవి దక్కిందని వారికే నా జీవితం అంకితం అని మండల టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ అన్నారు. వరుసగా రెండోసారి మండల టీడీపీ అధ్యక్షులుగా ఎంపికైన కిలారుకు మండలంలోని పలు గ్రామాల కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే మారుతినగర్‌లోని కిలారు ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కిలారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడితే సామాన్యులకు సైత పదవులు వస్తాయని.. అధిష్టానం తప్పక వారిని గుర్తిస్తుందని చెప్పేందుకు తానే నిదర్శనం అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ సహకారం మరువలేనిదని... వారి సూచనలు, సలహాలతోనే మండలంలో పార్టీని నడిపిస్తానని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పడిన కష్టం అంతా ఇంతా కాదని.. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న వేళ కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
2019లో పార్టీకి మండలంలో 7 వేలు మైనస్ వచ్చిందని.. ఐదేళ్ల పాటు అందరం సమష్టిగా కష్టపడడంతోనే గత ఎన్నికల్లో 4 వేల మెజార్టీ వచ్చిందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ఎమ్మెల్యే రోషన్ ఆధ్వర్యంలో కేడర్, నాయకులను కలుపుకుని వెళ్లడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కోసం అందరం పార్టీలో గ్రూపులు లేవు అని చాటి చెప్పేలా ఉండాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 5 గ్రామ కమిటీల ఎంపిక ప్రక్రియ కూడా ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తామని కిలారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్లు ఘంటా మాధవరావు, తూతా బాలాజీ, సర్పంచ్‌లు గూడపాటి కేశవరావు, గోరింక దాసు, వేముల నాగేశ్వరరావు, కంఠమనేని అంజిమూర్తి, బేతిన వెంకట్రావు, కంఠమనేని సత్యనారాయణ, నెక్కలపూడి మల్లిఖార్జునరావు, బొప్పన వీరశేఖర్‌రావు, మెరుగు సుందరరావు, ఎడ్రు శ్రీనివాసరావు, అడపా సత్యనారాయణ, పాలా శ్రీనివాస్, వడ్లపట్ల నరసింహారావు, సంకుల రాటాల రాజుయాదవ్, తమ్మినేని సత్యనారాయణ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు జుజ్జూరి బాబ్జి, మండల ఐ టీడీపీ అధ్యక్షుడు మాన్యం దుర్గారావు, ఘంటా సత్యంబాబు, తూతా లక్ష్మణరావు, ఏఎంసీ డైరెక్టర్ డోలా విజయ్, బొప్పన అంజయ్య, టెలికం అడ్వయిజరీ బోర్డు మెంబర్ పొన్నుబోయిన సురేష్, షేక్ ఇబ్రహీం, ఘంటా గోపీ, జనసేన నాయకులు వలీం, ప్రసాద్, కమలాకర్, బీజేపీ మండల అధ్యక్షులు సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి