ఇక ఆయనను కూటమిలోని ఒక కీలక నాయకుడే ఆహ్వానించారని, ఈ కార్యక్రమంతో సంబంధం లేని ఆ నాయకుడు వేసిన ఈ పాచికలో పెద్ద అర్థమే ఉందని తెలుస్తోంది. ఇది సాయిరెడ్డి తనను తాను కూటమికి అందుబాటులోకి ఉంచుతున్న సంకేతం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.వైసీపీ కోటరీపై అసంతృప్తి! .. వైసీపీలోకి తిరిగి వెళ్తారా అనే ప్రశ్నకు సాయిరెడ్డి ఇచ్చిన సమాధానం మరింత సస్పెన్స్‌ను పెంచింది. ఆయన ఆ ప్రశ్నను నేరుగా ఖండించకుండా, అది ఊహాజనిత ప్రశ్న అని చెప్పడం వెనుక ఒక వ్యూహం దాగి ఉంది. ముఖ్యంగా, ఆయన జగన్ చుట్టూ ఒక ‘కోటరీ’ (కోట్రీ) తయారైంది అని వ్యాఖ్యానించడం... వైసీపీతో దూరంగా ఉండడానికి గల అసలు కారణాన్ని బట్టబయలు చేసింది. పరోక్షంగా, పాత మిత్రుడు జగన్‌పైనే ఆయన అసంతృప్తి బాణాన్ని ఎక్కుపెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్‌తో 20 ఏళ్ల అనుబంధం: జనసేన ఆప్షన్? .. సాయిరెడ్డి తన భవిష్యత్ ప్రణాళికలను తెలియజేస్తూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉందని ప్రకటించడం అతిపెద్ద రాజకీయ మలుపు! తాను ఎప్పుడూ పవన్‌ను, జనసేనను విమర్శించలేదని చెప్పడం వెనుక... ఆ పార్టీలోకి వెళ్లడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లోకి వెళ్లే అవకాశం లేదు, బీజేపీ అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో జనసేనే ఆయనకు ప్రధాన ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే, కీలకమైన రాజ్యసభ పదవిని అనుభవించిన ఆయన స్థాయికి తగిన పదవిని జనసేన ఇవ్వగలుగుతుందా అనే సందేహం కూడా ఉంది. సాయిరెడ్డి రాజకీయ తుఫాను ఏ దిశగా మారుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి