పరిపాలన సౌలభ్యంగా ఉండాలంటే చిన్న చిన్న పల్లెలు,  మండలాలు, పట్టణ కేంద్రాలు, జిల్లాలు ఏర్పడాలి. అలా అయితే ప్రజలకు చాలా అద్భుతంగా పరిపాలనందుతుంది. అలా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో మూడు కొత్త జిల్లాలు ఒక్క కొత్త మండలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రివర్గం తెలియజేసింది. మరి ఆ జిల్లాలు ఏంటి వివరాలు చూద్దాం.. రంపచోడవరం కేంద్రంగా  పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని  ఇప్పటికే కేబినెట్ సిఫారసు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ సబ్ కమిటీ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణను ఓ కొలిక్కి తీసుకువచ్చింది.

 మంగళవారం రోజున ముఖ్యమంత్రిని కలిసి సవరించినటువంటి అధ్యయన నివేదికను సీఎంకు సమర్పణ చేసింది. ఇందులో మూడు జిల్లాలు ఉన్నాయి. పోలవరం,మదనపల్లె,మార్కాపురం అంతేకాకుండా కొత్తగా పెద్ద హరివాణం అనే మండలం కూడా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది మంత్రివర్గం. అయితే ఈ జిల్లాల ఏర్పాటు పై చంద్రబాబు మరియు ఉప సంఘం సభ్యులతో కలిసి చాలా సేపు చర్చలు జరిపారు. అనేక చర్చల అనంతరం ఈ నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇందులో మూడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు,ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలం ఏర్పాటుకు సిఫార్సు చేసింది మంత్రివర్గం.

 అంతేకాకుండా మరికొన్ని నియోజకవర్గాలు, మండలాలను వేరువేరు జిల్లాలు,డివిజన్లకు మార్చాలని తెలియజేసింది. దీనికి సంబంధించిన ఫైళ్లను కూడా రెవెన్యూ శాఖ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిని మంత్రులకు సర్కులేట్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఆమోదం తీసుకుంటారు. దీని తర్వాత రెవెన్యూ శాఖ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యంతరాలకు నెల రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత చివరి నోటిఫికేషన్ ని జారీ చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అలాగే 679 మండలాలు ఉన్నాయి. ఈ మూడు కొత్త జిల్లాల రాకతో 29 జిల్లాలు 89 రెవెన్యూ డివిజన్లో 680 మండలాలు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: