ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాలలో అన్ని సరుకులు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ పైన ఇస్తున్న సరుకులను మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన సరుకులను కూడా రేషన్ దుకాణాలలో విక్రయించేలా ప్లాన్ చేస్తోంది. ధరల విషయంలో కూడా చౌక ధరలకే విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. దీని వల్ల కూడా రేషన్ డీలర్లకు ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు చాలా చౌక ధరకే నాణ్యమైన సరుకులు అందుతాయని అంచనా వేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.


ఈ రేషన్ షాపులను విలేజ్ మాల్స్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 30 వేల రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చే ప్రక్రియను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులను రీ మోడలింగ్ చేసి చంద్రన్న విలేజ్ మాల్స్ అనే పేరుతో సూపర్ మార్కెట్ల తరహాలో షాపులను తీర్చిదిద్దేల భావిస్తున్నారట.


ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి డిమార్ట్, రిలయన్స్ వంటి సంస్థలు విక్రయించే ధరల కంటే చాలా చౌక ధరలకే సరుకులను విక్రయించేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదే సమయంలోనే ఈ విలేజ్ మాల్స్ నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించేలా ఏపీ ప్రభుత్వం చూస్తుందట. ఇందులో కొంతమంది డీలర్లు మాత్రం ప్రజలకు అవసరమైన (పప్పు దినుసులు, నూనె, రవ్వ, గోధుమపిండి) ఇలా ఓ 15 రకాలు సరుకులు ఉంటే సరిపోతుంది మాల్స్ లాగా అన్ని సరుకులు అందుబాటులో ఉంచడం అనేది చాలా కష్టంగా మారుతుందని తెలియజేస్తున్నారట. అలాగే ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి బియ్యం, చక్కెర, జొన్నలు వంటివి కొరత లేకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ మరొకసారి రేషన్ డీలర్లతో చర్చించిన తర్వాత రేషన్ షాపులు స్వరూపాన్ని మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నారు. ఒకవేళ చంద్రన్న విలేజ్ మాల్ అమలులోకి వచ్చి చౌక ధరలకు సరుకులు సరఫరా చేసారంటే ప్రజలకు పెద్ద భారం తగ్గబోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: