కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో చాలా తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలను పక్కనపెట్టి సీట్ కోసం కొట్లాడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత  సిద్ధరామయ్య సీఎంగా పదవిని అలంకరించారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ ను ఎన్నుకున్నారు. ఈ ఇద్దరు నాయకులకి కర్ణాటక రాష్ట్రంలో మంచి పేరు కలిగిన వారే. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన తర్వాత ముందుగా సిద్ధరామయ్యకు సీఎం అవకాశం ఇచ్చి రెండున్నర సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ కు ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానం. అయితే తాజాగా రెండున్నర సంవత్సరాలు పూర్తి కావడంతో డీకే శివకుమార్ తనకు సీఎం పదవి కావాలని తిరుగుబాటు చేస్తున్నారు. 

దీంతో అధిష్టానాన్ని కూడా కలిశారు.  నిజంగానే డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారా లేదా అనే వివరాలు చూద్దాం.. డీకే శివకుమార్ వర్గానికి సిద్ధరామయ్య వర్గానికి ప్రత్యక్షంగా మరియు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ డీకే శివకుమార్ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలని అంటూ రాహుల్ గాంధీకి తన సంకేతాన్ని సందేశాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా డీకే శివకుమార్ కాంగ్రెస్ పై తిరుగుబాటు చేస్తున్న సమయంలో సిద్ధరామయ్య మాత్రం అధిష్టానంను ఒప్పించి తానే సీఎంగా కొనసాగుతానని సంకేతాన్ని ఇస్తున్నారు..

ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు.  ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు పాలించమని మాత్రమే.. తప్పనిసరిగా నేనే సీఎం గా ఉంటానంటూ ఇండైరెక్టుగా చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. ఈ విధంగా కర్ణాటక రాజకీయాల్లో సీఎం వర్సెస్ డిప్యూటీ అనే విధంగా వార్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం సిద్ధరామయ్యను పక్కనపెట్టి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి అందిస్తుందా.. లేదంటే సిద్ధరామయ్యని అలాగే కొనసాగిస్తుందా అనేది త్వరలో బయటకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: