రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.టీ పోల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓటరు తన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నామినేషన్ల జాబితా రిజర్వేషన్ వివరాలు పోలింగ్ బూత్ స్థానం ఫలితాలు వంటి అన్ని విషయాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు కూడా తమ నామినేషన్ స్థితి గుర్తింపు గుర్తులు సంబంధిత నిబంధనలు ఈ యాప్ ద్వారానే సులువుగా చూసుకోవచ్చు.
ఎస్‌ఈసీ ఈ యాప్‌ను అత్యంత సరళంగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రూపొందించింది.పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎదురైన ఫిర్యాదులు గందరగోళాలు ఈ యాప్ ద్వారా గణనీయంగా తగ్గుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ సమస్యలు నామినేషన్ రిజెక్షన్లు పోలింగ్ ఏర్పాట్లు వంటి అంశాల్లో పారదర్శకత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ యాప్ ద్వారా రియల్ టైమ్ అప్‌డేట్స్ లభించడంతో ప్రజల్లో ఎన్నికల పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని అంచనా. టీ పోల్ యాప్ ప్రారంభంతో తెలంగాణ ఎన్నికల సంఘం దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న ఎస్‌ఈసీల్లో ఒకటిగా నిలిచింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి