మరి ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి ఉచిత పథకాలు ఇస్తున్నాయని రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద సృష్టించే మార్గాలను చూడాలి కానీ ఇలా అప్పులు తెచ్చి మరి ఉచితాలు ఇవ్వడం సరైనది కాదు అంటూ తెలియజేశారు. ఇటీవల సేవా జ్యోతి పురస్కార ప్రధానం సందర్భంగా వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏది కూడా ఉచితంగానే ఇవ్వకూడదని తన అభిప్రాయం అంటూ తెలియజేశారు. ఇలా ప్రజలకు ఉచితంగా ఇస్తూ పోతే తనకి ఎలాంటి నష్టం లేదు,కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తెలియజేశారు. ఇది ఎవరు చెప్పని ఒక భయంకరమైన నిజం అంటూ తెలిపారు.
పేద ప్రజలకు విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మిగతావి ఏవి కూడా ఉచితంగా ఇవ్వకూడదని తన అభిప్రాయం అంటూ తెలిపారు. ఉచిత పథకాల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించుకోవాలంటు తెలియజేశారు. ఈ ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అప్పుల ఊబిలోకి కూడా నెట్టేసేలా చేస్తాయంటూ తెలియజేశారు. ఎవరు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని పార్టీ మారితే పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్ తీసుకురావాలని తెలియజేశారు వెంకయ్య నాయుడు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి