మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం రాష్ట్రస్థాయి రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు నేతలు తమ రాజకీయ ప్రస్థానం కొనసాగించేందుకు కసరత్తులు మొదలుపెడతారు. కానీ మాగుంట మాత్రం మూడు సంవత్సరాల ముందుగానే 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడంతో తన వారసుడికి దారి సుగమం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది.
పైగా `నన్ను ఆశీర్వదించినట్లు నా కుమారుడినీ ఆశీర్వదించాలి` అని ఆయన ప్రజలకు చేసిన అభ్యర్థన ఒంగోలు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి రాఘవరెడ్డి రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. వైసీపీలో ఉన్నప్పుడే మాగుంట ఆయనను గ్రౌండ్‌లో యాక్టివ్ చేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ రావచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు పోటీ ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు మాగుంటకే అవకాశం ఇచ్చారు. ఇక తాజాగా ఆయన రిటైర్మెంట్ ప్రకటనతో ఒంగోలు పాలిటిక్స్ లో పవర్ షిఫ్ట్ ఖాయమైంది.
కాగా, మాగుంట కుటుంబం అంటే కేవలం రాజకీయాలే కాదు… దక్షిణాన లిక్కర్ వ్యాపారంలో పెద్ద సామ్రాజ్యం. దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగిన ఈ కుటుంబం ప్రభావం ఒంగోలు రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక రోలర్ కోస్టర్‌లాంటిదే.
మొదట కాంగ్రెస్‌లో కెరీర్ ప్రారంభించి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ.. చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీ వైపు మొగ్గు చూపిన మాగుంట.. ఒంగోలు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024కు ముందు మళ్లీ టీడీపీలోకి షిఫ్ట్ అవ్వగా.. మరొకసారి ఒంగోలు ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇలా పార్టీల మార్పులు జరిగినా… మాగుంటల వ్యక్తిగత ఇమేజ్, వారి కుటుంబ ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇది రాబోయే పవర్ షిఫ్ట్‌లో కీలక అంశంగా మరే అవకం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి