తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఎన్నికల నగారా మోగింది.. మొత్తం మూడు విడతలుగా ఎలక్షన్స్ నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే తెలియజేసింది. ఇందులో డిసెంబర్ 11,డిసెంబర్ 14, డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అంతేకాదు మొదటి విడత, రెండవ విడత నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ప్రస్తుతం మూడవ విడత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అలాంటి ఈ తరుణంలో పార్టీల్లో సర్పంచ్ గా నిలబడే అభ్యర్థులు గ్రామాల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపై నమ్మకం కలిగించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి ఈ తరుణంలో సర్పంచ్ కి పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి లక్షణాలు ఉండాలి.. ఈ ఐదు లక్షణాలు ఉంటే సర్పంచ్ అభ్యర్థిగా తప్పకుండా పనికి వస్తారని గమనించాలి..

 నిజాయితీ:
 గ్రామ విధులను నిజాయితీగా నిర్వర్తించాలి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనానికే మొగ్గు చూపాలి.

 సమస్యలపై దృష్టి:
 ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామంలో ఉండే సమస్యలను బేరీజు చేసుకొని ముందుకు వెళ్లాలి. ఆ సమస్యలను తప్పకుండా క్లియర్ చేసేందుకు కృషి చేయాలి.

 కులమత బేధాలు ఉండరాదు :
 మరీ ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తులకు కులమత బేధాలు అనేవి ఉండకూడదు. సర్పంచ్ అంటే ఊరికి ఒక దారి చూపే అభ్యర్థి. ఇందులో కులమత జాతి అనే వివక్ష లేకుండా ముందుకు వెళ్లే గుణం వారిలో ఉండాలి.
 
 ప్రభుత్వం నుంచి నిధులు:
 సర్పంచ్ అభ్యర్థులు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఆ నిధులతో గ్రామాన్ని డెవలప్ చేయాలి.

 రాష్ట్ర నాయకులతో సమన్వయం:
 సర్పంచ్ అభ్యర్థికి ముఖ్యంగా ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులతో సమన్వయంతో ఉండాలి. గ్రామంలో ఉండే సమస్యలను వారికి వినిపించి నిధులు తీసుకువచ్చి వాటికి పరిష్కార మార్గం చూపాలి. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా క్లియర్ చేసి, వారికి అండగా నిలబడే వ్యక్తి సర్పంచి పదవికి నిజమైన న్యాయం చేయగలరు.
 ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీ గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: