తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం మేడ్చల్ నియోజకవర్గంలో జరిపిన జాగృతి జనంబాట పర్యటనలో మాజీ మంత్రి చింతకుంట మల్లారెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డును సందర్శించిన తర్వాత అంబేడ్కర్‌నగర్ బస్తీలో ప్రజలతో మాట్లాడారు. ఆ తర్వాత మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని లక్ష్మాపూర్‌లో రైతుల సమస్యలు స్వయంగా విన్నారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలనష్టాలు చూసిన కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

కవిత మాట్లాడుతూ మల్లారెడ్డి ఐదేళ్లు మంత్రిగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా మేడ్చల్‌లో పూలమ్మిండు పాలమ్మిండు వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. పేదలకు ఏమాత్రం మేలు చేయలేదని ఆయన అని ధ్వజమెత్తారు. తాగునీరు రోడ్లు పాఠశాలలు ఆస్పత్రులు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలు చాలా తక్కువగా ఉండటం వల్ల యువత ఉన్నత చదువులు చదవలేక గంజాయి వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు రెట్టింపయ్యాయని కవిత అన్నారు. జీవో నంబర్ 58 59 ప్రకారంభించిన భూముల క్రమబద్ధీకరణ పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసినా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆమె ఆరోపించారు. అదే సమయంలో మాజీ మేయర్ మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్నించారు. ఈ అంశంపై అవసరంగా సుప్రీంకోర్టు వరకు వెళ్తానని హెచ్చరించారు.

లక్ష్మాపూర్‌లో రతులతో ముఖాముఖి నిర్వహించిన కవిత మేడ్చల్ ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను బయటపెట్టడం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. మల్లారెడ్డి పై ఈ నేరుగా ధ్వజమెత్తడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. కవిత ఈ ఆరోపణలతో మల్లారెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: