మేడ్చల్‌లో చాలా అభివృద్ధి జరిగినట్టు మల్లారెడ్డి ప్రస్తావిస్తున్నా, స్థానికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని తన పర్యటనలో గుర్తించినట్లు కవిత పేర్కొన్నారు. స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజ్‌లు తక్కువగా ఉండటం వల్ల యువత ఉన్నత చదువులు కొనసాగించలేక గంజాయి తదితర వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపు అయ్యాయని, జీవో నంబర్ 58, 59ల కింద భూముల క్రమబద్ధీకరణకు పేదలతో డబ్బులు కట్టించుకున్నప్పటికీ నేటికీ వారికి రిజిస్ట్రేషన్లు కాలేదని కవిత నిప్పులు చెరిగారు. అయితే, మాజీ మేయర్ మరియు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని ఆమె ప్రశ్నించారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై సుప్రీం కోర్టు వరకు వెళ్తానని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. కవిత రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. కవిత పాలిటిక్స్ లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి