ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. ఈ లక్కీ డ్రా నిజమే. ప్రచారంలో ఉన్న తహర్ థియేటర్ ను కొన్నేళ్ల క్రితం తాము రూ. 8.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశామని ఆ తర్వాత దానిపైన రూ. 4.5 కోట్ల రూపాయల బ్యాంకు లోను తీసుకున్నామని కానీ దీన్ని సేల్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఇంత ప్రాపర్టీ కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. అందుకే ఈ ఆస్తిని అమ్మాలనే ఆలోచనతోనే ఈ లక్కీ డ్రా ఆలోచన చేసినట్లు వెల్లడించారు.
ఈ లక్కీ డ్రా వచ్చే మార్చి 29వ తేదీన తీస్తామని. ఎవరికి వస్తే వారికి రిజిస్ట్రేషన్ చార్జీలతో సహా పూర్తి స్టాంపు డ్యూటీ తో తామే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలిపారు. కానీ లక్ష మందిని టార్గెట్ చేసుకున్నామనే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.ఈ లక్కీ డ్రా లో పాల్గొనే అవకాశం వచ్చేయేడాది మార్చి 28వ తేదీ వరకు ఉంటుందని, ఇప్పటివరకు అయితే 300 వరకు టోకెన్లు వచ్చాయని. వీటిని మరింత పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఏది ఏమైనాప్పటికీ రూ.1000 రూపాయలకే థియేటర్ సొంతం అంటూ బ్యానర్ రావడంతో కడుపలో హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి