అక్కడ ఉండే స్థానికులు, వాహనదారులు ఈ మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు చేయి జారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక వ్యక్తి తన మొబైల్ లో నుంచి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఈ 4 బస్సులు మంటలలో పూర్తిగా కాలిపోయాయని వీడియోలో తెలియజేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం పైన ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించింది. అక్కడ ప్రాంతంలో మంచు కారణం వల్ల 7 బస్సులు 3 కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో 20 కి పైగా అంబులెన్సులు వచ్చాయని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. బల్దేవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక మృతుల వివరాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి