టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో మ్యాచ్‌లను ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడం ఆ దేశ క్రికెట్‌కు గొడ్డలిపెట్టుగా మారింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ రాజకీయ కారణాలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్టుబట్టింది. ఐసీసీ స్వయంగా భద్రతా తనిఖీలు చేసి భారత్ సురక్షితమని సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన పంతాన్ని వీడలేదు. జనవరి 21తో ముగిసిన గడువులోగా cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చుకునేందుకు ఐసీసీ సిద్ధమైంది. దశాబ్దాలుగా నిర్మించుకున్న క్రికెట్ సామ్రాజ్యం ఇప్పుడు రాజకీయ స్వార్థం వల్ల కుప్పకూలిపోతోంది.


అకారణంగా భారత్‌పై చూపిస్తున్న రాజకీయ ద్వేషం వల్ల ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న క్రికెట్ దేశం ప్రపంచ వేదికపై తన స్థానాన్ని కోల్పోయే దుస్థితికి చేరుకుంది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్‌పై కోలుకోలేని దెబ్బ తీయబోతోంది. ఒకసారి ఐసీసీ ఈవెంట్‌ను బహిష్కరిస్తే భవిష్యత్తులో ఆ దేశానికి వచ్చే నిధులపై కోత పడటమే కాకుండా ఇతర దేశాలు కూడా బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ వంటి శక్తివంతమైన దేశంతో క్రికెట్ సంబంధాలు తెగిపోతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా కుప్పకూలడం ఖాయమని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి ఆటగాళ్ల భద్రతను సాకుగా చూపిస్తూ cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బీసీబీ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. పాకిస్థాన్ మినహా మిగతా ప్రపంచ దేశాలతో క్రికెట్ ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు. ఇది బంగ్లా క్రికెట్‌ను పతనం దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక క్రీడల కన్నా రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాలు భారత్‌కు మద్దతు తెలపడం గమనార్హం. కేవలం పాకిస్థాన్ మాత్రమే బంగ్లాదేశ్ వాదనను సమర్థించింది.


బంగ్లాదేశ్ అభిమానులు తమ జట్టును ప్రపంచకప్‌లో చూసుకోలేకపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ మనుగడ సాగించడమే ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ జట్టు ఇటలీ, నేపాల్ వంటి జట్లతో పోటీ పడనుంది. రాజకీయ అవసరాల కోసం క్రీడలను బలిపశువును చేయడం వల్ల వేల సంఖ్యలో ఉన్న క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: