పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, హర్రర్ కామెడీ జోనర్‌లో ప్రభాస్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. అయితే ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచి విడుదల వరకు అనేక మలుపులు తిరిగింది. షూటింగ్ సమయంలో కొన్ని వాయిదాలు పడటం, ప్రభాస్ ఇతర భారీ చిత్రాలైన ‘ సలార్ ’ ‘కల్కి 2898 AD’ వంటి వాటితో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయినా మారుతి తనదైన శైలిలో సినిమాను పూర్తి చేసి పండుగ సీజన్ కు సిద్ధం చేశారు. విడుదల తర్వాత వస్తున్న స్పందన చూస్తుంటే, ప్రభాస్ ఇమేజ్ కు మారుతి కామెడీ టైమింగ్ తోడై ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది.
ఈ సినిమా ఫలితంపై ప్రస్తుతం ఫిలిం నగర్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది హర్రర్ అంశాలు, ప్రభాస్ వింటేజ్ లుక్స్ బాగున్నాయని ప్రశంసిస్తుంటే, మరికొందరు కథలో బలం లేదని పెదవి విరుస్తున్నారు. సంక్రాంతి పోటీలో ఉన్న ఇతర చిత్రాలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రభావం దీనిపై కొంత పడింది. అయినా ప్రభాస్ గ్లోబల్ స్టార్ కావడంతో వసూళ్ల పరంగా మాత్రం సినిమా నిలకడగా సాగుతోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ప్రభాస్ కామెడీని ఎంజాయ్ చేసే వారు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ప్రభాస్ చేసిన సీరియస్ రోల్స్ తో పోలిస్తే ఇందులో ఆయన ఎంతో ఎనర్జిటిక్ గా, హుషారుగా కనిపించడం అభిమానులకు కనువిందు కలిగిస్తోంది.
అయితే రెండు రోజులుగా సోషల్ మీడియాలో దర్శకుడు మారుతితో పాటు ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యుసర్ కెఎస్. ఎన్ ను గట్టిగా టార్గెట్ చేశారు. వీరిద్దరపై భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. 21వ తేదీ అంతా కొన్ని వందల పోస్టులు వీరిద్దరిని టార్గెట్ గా చేసుకుని వేసినవే కనిపిస్తున్నాయి. ఇదంతా ప్రీ ప్లాన్ తోనే కావాలనే చేసినట్టుగా ఉందన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్లాప్ వీరిద్దరి మీదే నెట్టి వేయాలని కావాలనే కొందరు ఇలా చేశారని గుసగుసలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి