నందమూరి బాలకృష్ణ తన నట ప్రస్థానంలో సరికొత్త వేగాన్ని ప్రదర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. బాలయ్య ఇటీవల అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య నెక్ట్స్ 5 సినిమాల లైనప్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు గోపీచంద్ మలినేనితో బాలయ్య కొత్త సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. కొరటాల శివ, అనిల్ రావిపూడి, బాబీ కొల్లి వంటి దిగ్గజాలతో పాటు ఒక నూతన దర్శకుడు వినిపించిన కథలు బాలయ్యను ఆకట్టుకున్నాయని టాక్ ? ఈ ఐదుగురు దర్శకుల విభిన్న కథాంశాలు నచ్చడంతో వీరందరికీ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
ప్రముఖ నిర్మాతలు కూడా బాలయ్య డేట్ల కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అలాగే సాహు గారపాటి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న చిత్రానికి బాలయ్యకు అడ్వాన్స్ కూడా అందజేశారట. వీరితో పాటు అనిల్ సుంకర, నాగ వంశీ, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కాబోతున్నారు. దిల్ రాజు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బాలయ్య సినిమా ఇన్నాళ్లకు పట్టాలెక్కే సూచనలు కనిపిస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
బాలయ్య తుది నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ ఏడాది రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. పక్కా ప్రణాళికతో మార్చి నెలలో మొదటి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక రెండో సినిమాను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ మాసంలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే ఏడాది రెండు భారీ ప్రాజెక్టులు మొదలవుతుండటంతో నందమూరి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా గోపీచంద్ మలినేనితో చేస్తున్న చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా బాలయ్య కెరీర్‌లో 111వ చిత్రంగా రికార్డు సృష్టించనుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి