తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా  రసవత్తరంగా మారాయి. ఇప్పటికే సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. అంతేకాకుండా తాజాగా కేటీఆర్ కు కూడా  అధికారులు నోటీసులు అందించారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ కార్తీకదీపం  సీరియల్ సాగదీసినట్టు సాగదీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో కవితకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కొన్ని విషయాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . సిట్ అధికారులు నోటీసులు ఇస్తే కేటీఆర్ కార్యకర్తలను కలవకుండా  కార్తీకదీపం సీరియల్ చూస్తున్నారని  మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

ఇదే సమయంలో ఈ నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ గుంట నక్క ఈ పని అంతా చేస్తుందని పోస్ట్ లు పెడుతున్నారు. ఆ గుంట నక్కకు కేటీఆర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతే  సంబర పడుతుందని అంటున్నారు. ఈ విధంగా ఎవరికి వారే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటే తాజాగా కేటీఆర్ నోటీసులకు సంబంధించి కార్తీకదీపం సీరియల్ మీమ్స్ క్రియేట్ చేసి నోటీసులు ఇచ్చినా కానీ కేటీఆర్ సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారు. అందుకే కార్తీకదీపం సీరియల్ గురించి ఆయన మాట్లాడుతున్నారని నవ్వుతూ విమర్శలు చేస్తున్నారు. గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చెప్పిందే వేదంలా నడిచింది.

ఎప్పుడైతే అధికారం కోల్పోయారో కవిత పూర్తిగా పార్టీకి దూరమయ్యి అప్పటినుంచి పార్టీపై పార్టీ నాయకులపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తోంది.  తన తండ్రి కేసీఆర్ తీసుకువచ్చిన ఈ పార్టీ  పేదలకు ఎంతో మేలు చేసిందని, కానీ కొంతమంది దొంగలు పార్టీని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారని, కేసీఆర్ వాళ్ళని పక్కనుంచుకుంటున్నారని చెప్పుకొస్తోంది. వాళ్లని దూరం పెడితేనే పార్టీ బలపడుతుందని చెప్పకనే చెప్పింది. ఏది ఏమైనప్పటికీ  బీఆర్ఎస్ పార్టీలో కవిత ద్వారా పుట్టిన అలజడి పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుందా, లేదంటే పార్టీకే బలం చేకురుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: